Tuesday 23 February 2016

పుష్కరాలు

పుష్కరము అంటే పన్నెండు సంవత్సరాలు, ఒక భారత కాలమానము. ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశములోని 12 ముఖ్యమైన నదులన్నింటికీ ‘పుష్కరాలు’ వస్తాయి. పుష్కర సమయములో ఆయానదులలో స్నానము చేస్తే ప్రత్యేక పుణ్యఫలం ప్రాప్తిస్తుందని హిందువులు భావిస్తారు. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయానదికి పుస్కరాలు వస్తాయి. బృహస్పతి ఆ రాశిలో ఉన్నంతకాలము ఆ నది పుష్కరములో ఉన్నట్టే. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. పుష్కరకాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరము అని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరము అని వ్యవహరిస్తారు. ఈ మొదటి మరియు చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి.

మేష రాశిలో గురు ప్రవేశం వల్ల ‘గంగా నది’ పుష్కరాలు
వృషభ రాశిలో ప్రవేశిస్తే ‘రేవా నది’ పుష్కరాలు
మిథున రాశిలో ప్రవేశిస్తే ‘సరస్వతీ నది’ పుష్కరాలు
కర్కాటక రాశిలో ప్రవేశిస్తే ‘యమునా నది’ పుష్కరాలు
సింహ రాశిలో ప్రవేశిస్తే ‘గోదావరి’ పుష్కరాలు
కన్యా రాశిలో ప్రవేశిస్తే ‘కృష్ణా నది’ పుష్కరాలు
తులారాశిలో ప్రవేశిస్తే ‘కావేరి నది’ పుష్కరాలు
వృశ్చిక రాశిలో ప్రవేశిస్తే ‘భీమరథీ నది’ పుష్కరాలు
ధనస్సు రాశిలో ప్రవేశిస్తే ‘పుష్కరవాహిని’ పుష్కరాలు
మకర రాశిలో ప్రవేశిస్తే ‘తుంగభద్ర నది’ పుష్కరాలు
కుంభ రాశిలో ప్రవేశిస్తే ‘సింధు నది’ పుష్కరాలు
మీన రాశిలో ప్రవేశిస్తే ‘ప్రణీత నది’ పుష్కరాలు.

గోదావరి పుష్కరాలు – 2015 జూలై 14 వ తేదీ నుండి 25 వ తేదీ వరకు
కృష్ణ  పుష్కరాలు     –  2016 ఆగష్టు 12 వ తేదీ నుండి 23 వ తేదీ వరకు
కావేరీ పుష్కరాలు   –  2017 సెప్టెంబర్ 12 వ తేదీ నుండి 23 వ తేదీ వరకు
తామ్రపర్ణి పుష్కరాలు – 2018 సెప్టెంబర్ 12 వ తేదీ నుండి 23 వ తేదీ వరకు
పుష్కరవాహిని పుష్కరాలు – 2019 మార్చి 29 వ తేదీ నుండి ఏప్రిల్ 9 వ తేదీ వరకు
తుంగభద్ర పుష్కరాలు – 2020 మార్చి 30 వ తేదీ నుండి ఏప్రిల్ 10 వ తేదీ వరకు
సింధూ నది పుష్కరాలు – 2021 ఏప్రిల్ 6 వ తేదీ నుండి ఏప్రిల్ 17 వ తేదీ వరకు
ప్రణీత నది పుష్కరాలు – 2022 ఏప్రిల్ 13 వ తేదీ నుండి ఏప్రిల్ 24 వ తేదీ వరకు
గంగా నది పుష్కరాలు – 2023 ఏప్రిల్ 22 వ తేదీ నుండి మే 5 వ తేదీ వరకు
నర్మదా నది పుష్కరాలు – 2024 ఏప్రిల్ 22 వ తేదీ నుండి మే 5 వ తేదీ వరకు
సరస్వతీ నది పుష్కరాలు – 2025 మే 15 వ తేదీ నుండి మే 26 వ తేదీ వరకు
యమునా నది పుష్కరాలు – 2026 జూన్ 2 వ తేదీ నుండి జూన్ 13 వ తేదీ వరకు

1 comment:

హరిద్వార్ లో హార హార మహ యజ్ఞం

https://www.youtube.com/live/JW26xc6TEqo?si=A0ps2iLvaAUCEtE_