Saturday 8 December 2018

pancha prayagalu


పంచ ప్రయాగాలు
ప్రయాగ అనగా  నదులు సంగమించే ప్రదేశం .   రెండు నదుల నీటి ప్రవాహాలు ఒకదానితో మరొకటి కలిసిపోయే పవిత్ర ప్రదేశం . . చార్ధామ్ యాత్ర భాగములో    విష్ణుప్రయాగ, నందప్రయాగ   ,కర్ణప్రయాగ,   రుద్రప్రయాగ,   దేవప్రయాగ .    ఈఐదింటిని పంచప్రయాగలు అని అంటారు.
గ౦గానదికి ఉన్న నాలుగు ఉపనదులు అలకన౦దానది లో కలుస్తాయి . తర్వాత అలకన౦ద గ౦గతో కలుస్తు౦ది.                    హిమాలయపర్వత ల లో పుట్టి అనేక పర్వత ల లో   ప్రవహి౦చి గ౦గలో చేరే యీ నదులను దేవనదులు అంటారు.
1. విష్ణుప్రయాగ : అలకన౦ద ,ధౌలిగ౦గ కలిసే క్షేత్రాన్ని విష్ణుప్రయాగ అని అంటారు.
విష్ణమూర్తి బదరీవనానికి వెళుతూ ఈ సంగమం దగ్గర కొంతకాలం తపస్సుచేశారట.అందువలన ఈపవిత్రప్రదేశానికి విష్ణుప్రయాగ అనిపేరు వచ్చినది .
2. నందప్రయాగ : నందాకిని అలకన౦దతో కలిసే క్షేత్రాన్ని న౦దప్రయాగ అని అంటారు
మామూలుగ దేవనది గంగ, మ౦దాకిని గురి౦చి వి౦టాము.గర్వాల్ ప్రా౦త౦లో న౦దాకిని అనే నది ఉ౦ది.న౦దాదేవి అనే అభయారణ్యం ఒకటి ఉ౦దిట.దానిక౦టే ఎత్తు లో ఉన్న న౦దఘ౦టి అనే గ్లెసియర్ ను౦చి యీనది జన్మించిందట.అందువలన ఈ చిన్ననదికి నందాకిని యని పేరు వచ్చిందట.
3 ) కర్ణప్రయాగ : పి౦డార్ అనే నది అలకన౦దలో కలిసే క్షేత్రాన్ని కర్ణప్రయాగ అని అ౦టారు .మహభారత కధలోని కర్ణుడు యీ క్షేత్ర౦లో సూర్యుణ్ణి ఉపాసి౦చి కవచకుండలాలు పొందాడు అన్నది స్థలపురాణం.
4) రుద్రప్రయాగ : మ౦దాకిని నది అలకనంద నదిలో కలిసే క్షేత్రాన్ని రుద్రప్రయాగ అని అంటారు
5) దేవప్రయాగ : అలకన౦దనది భాగీరథి లో కలిసే క్షేత్రాన్ని దేవప్రయాగ అని అంటారు.
అలకన౦ద నది నీరు మట్టిర౦గులో ఉన్నాయి,భాగీరథిలో నీరు స్వచ్ఛ౦గా ఉన్నాయి. రె౦డు ర౦గుల ప్రవాహాలు ఒకదాని పక్కన మరొకటి కొ౦త దూర౦ ప్రవహి౦చి తరువాత కలిసిపోయి ఒకే ప్రవాహ౦ అవుతున్నాయి.ఈ స౦గమ౦ చాల అద్భుత మైన దృశ్యం.ఆ అద్బుత దృశ్యం చూడగలగటం చాల  అదృష్టం.  గరుడ గంగానది  సమీపము న   గరుత్మంతుడి గుడి ఉంది .ఆనదిలో ఉన్న రాళ్ళను ఏరి తెచ్చి పక్కనే ఉన్న గరుత్మంతుడి ఆలయంలో ,హనుమంతుడి ,ఆలయంలో పూజలు చేయించి తీసుకున్నాము.అలా పూజ చేయించి తెచ్చిన రాళ్ళు ఇంట్లో ఉంటే సర్పభయం,విషభయం.ఉండవన్నారు. అక్కడి స్థానికులు


No comments:

Post a Comment

హరిద్వార్ లో హార హార మహ యజ్ఞం

https://www.youtube.com/live/JW26xc6TEqo?si=A0ps2iLvaAUCEtE_